త్వరలో వన్యప్రాణుల గణన
డొంకేశ్వర్(ఆర్మూర్): వన్య ప్రాణుల గణన ప్రక్రియ ఈనెలాఖరున లేదా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. దేశమంతటా ఒకేసారి చేపట్టే వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ సన్నద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇటీవల వర్నిలో నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల అధికారులు, సిబ్బంది శిక్షణ పొందారు. పులులు, చిరుతలు, జింకలు, ఎలుగు బంట్లు, తోడేళ్లు, నక్కలు, దుప్పులు, మానుబోతులు వంటి అటవీ జంవుతులు ఎన్ని ఉన్నాయి? వాటిని ఏ విధంగా లెక్కించాలనే దానిపై అదిలాబాద్ అడవులకు చెందిన వన్యప్రాణి నిపుణులు వచ్చి శిక్షణ ఇచ్చారు. వన్యప్రాణుల గణన సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతులు, మెలకువలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన వెంటనే వన్యప్రాణుల గణనను ప్రారంభించనున్నారు. అటవీ సిబ్బంది టీములుగా అడవుల్లోకి వెళ్లి జంతువుల పాదముద్రలు, ట్రాప్ కెమెరాల ఆధారంగా వాటిని సంఖ్యను అంచనా వేస్తారు. ప్రభుత్వం నాలుగేళ్లకోసారి వన్యప్రాణుల గణన చేపడుతుండగా చివరిసారిగా 2021లో జరిగింది.
జిల్లాలో 86,871.45 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం సిరికొండ, కమ్మర్‌పల్లి, ఇందల్వాయి, నిజామాబా ద్ సౌత్, నిజామాబాద్ నార్త్, వర్ని, ఆర్మూర్ రేంజ్ లు ఉన్నాయి. ఇందల్‌వాయి తర్వాత సిరికొండ, క మ్మర్‌పల్లి, వర్ని, నిజామాబాద్‌సౌత్ రేంజ్‌లలో ఎ క్కువగా అడవులున్నాయి. ఈ ప్రాంతాల్లోనే వన్య ప్రాణులు ఎక్కువగా ఉంటాయి. పాత గణాంకాల తో పోలిస్తే ప్రస్తుతానికి వన్యప్రాణుల సంఖ్య పెరిగి ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. వన్య ప్రాణుల సంఖ్య ఏ మేరకు పెరిగింది అనేది ప్రస్తుతం చేపట్టనున్న గణనతో తేలనుంది.
వన్యప్రాణుల గణనకు అటవీ అధికారులు, సిబ్బందితోపాటు పారెస్ట్రీ కోర్సులు చేస్తున్న విద్యార్థులను వలంటీర్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు. జిల్లా లో బీట్, సెక్షన్ అఫీసర్లతోపాటు డిప్యూటీ ఎఫ్‌ఆ ర్వోలు, ఎఫ్‌ఆర్వోలు, ఎఫ్‌డీవోలు కలిపి 150మంది అటవీ శాఖలో లేరు. వీరితో వన్యప్రాణుల గణనను త్వరగా పూర్తి చేయడం సాధ్యం కాదు. అందుకే స ర్వేలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరుతున్నారు. వచ్చిన వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.
ఈ నెలాఖరున లేదా
వచ్చే నెలలో ప్రారంభం
నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు..
లెక్కించే విధానంపై
అటవీ సిబ్బందికి శిక్షణ పూర్తి


