ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ఫోకస్‌

Nov 10 2025 8:02 AM | Updated on Nov 10 2025 8:02 AM

ఫోకస్

ఫోకస్‌

విడతల వారీగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

క్రీడల్లో ఉన్నతస్థాయికి..

క్రీడా రంగంలో అవకాశాలను సద్వినియో గం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని మైనారిటీ సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు.

సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

– 8లో u

జూనియర్‌

కళాశాలలపై

ఖలీల్‌వాడి : జిల్లాలోని జూనియర్‌ కళాశాలలపై ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ కాలేజీలను ఇప్పటికే ప్రక్షాళన చేయగా, క్షేత్రస్థాయిలో ఆచరణ, పరిస్థితుల అధ్యయనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల వివరాలను రోజువారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జీపీఎస్‌ ఆధారంగా తనిఖీలు చేపడుతుండటంతో కాలేజీ యాజమాన్యాల్లో గుబులు పుడుతోంది. తనిఖీలతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లోని వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసే అవకాశం ఏర్పడింది. దీంతో నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని రెండు బృందాలు ఈనెల 4వ తేదీ నుంచి తనిఖీలు ప్రారంభించాయి. రాష్ట్రస్థాయి అధికారులతో కూడిన మరో బృందం సైతం కాలేజీలను తనిఖీ చేయనున్నాయి. జిల్లాలో ప్రతిరోజూ రెండు నుంచి నాలుగు కాలేజీలను రెండు బృందాలు తనిఖీ చేస్తున్నాయి.

జిల్లాలో మొత్తం 133 జూనియర్‌ కాలేజీలు ఉండగా వాటిలో 16 ప్రభుత్వ, 71 ప్రభుత్వ సెక్టార్‌, కేజీబీవీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల కళాశాలలు, 49 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఇంటర్‌ బోర్డు మూడు బృందాలను ఏర్పాటు చేసింది. మొదటి బృందంలో డీఐఈవో, మరో బృందంలో ప్రత్యేకాధికారి (ఇంటర్మీడియెట్‌ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ), ఇంకో బృందంలో డిప్యూటీ సెక్రటరీలతో తనిఖీలు చేపడుతున్నారు. తొలి విడతలో డీఐఈవో నేతృత్వంలోని బృందానికి 12 కళాశాలలు, మరో రెండు బృందాలకు 15 చొప్పున కళాశాలల్లో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల డీఐఈవో బోధన్‌, ఆర్మూర్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలను తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో తనిఖీలు చేపడుతున్నాం. జీపీఎస్‌ ట్రాకింగ్‌ విధానంలో ఎప్పటికప్పుడు నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో రెండు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. రాష్ట్రస్థాయి బృందం సైతం తనిఖీలు చేస్తుంది.

– రవికుమార్‌, డీఐఈవో, నిజామాబాద్‌

మూడు బృందాలతో ఇంటర్‌

కాలేజీల తనిఖీ

మౌలిక వసతులు, విద్యాబోధన

తీరు పరిశీలన

ఆన్‌లైన్‌లో నివేదిక

ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాల్లో గుబులు

పరిశీలించే అంశాలివే..

కాలేజీలో సమయసారిణి అమలు, సబ్జెక్టుల వారీగా సిలబస్‌ ఎంత వరకు చేశారు. కాలేజీకి వచ్చే విద్యార్థులు, లెక్చరర్ల హాజరు శాతం, కా లేజీలో మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తారు. వసతులు లేకుంటే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే వివరాలను సేకరిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తీసుకునే చర్యలతోపాటు ఎ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే అంశాలపై వాకబు చేస్తారు. కాలేజీ పరిధిలో ఏఏ గ్రా మాల నుంచి అడ్మిషన్లు వస్తున్నాయి.. మిగతా ప్రాంతాల నుంచి అడ్మిషన్లు రాకపోవడానికి కా రణాలను లెక్చరర్లను అడిగి తెలుసుకుంటున్నా రు. లెక్చరర్ల బోధనపై సైతం ఆరా తీస్తున్నారు.

ఫోకస్‌1
1/1

ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement