
పెండింగ్ బిల్లు చెల్లించాలి
● సీఎం సలహాదారుకు వినతి
ఖలీల్‌వాడి: పెండింగ్‌లో ఉన్న బిల్లులను అందించాలని జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు షకీల్‌పాషా కోరారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిను బుధవారం కలిసిన జిల్లా పోలీసుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2024 జనవరిలో డిపార్ట్‌మెంట్‌కు రావాల్సిన ఎస్‌ఎల్‌ఎస్, అడిషనల్ ఎస్‌ఎల్‌ఎస్–5, జీపీఎఫ్, 2018 పీఆర్‌సీ బకాయిలు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరు ఉద్యోగులకు పీఆర్సీ అందించారని, పోలీసులకు ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగులు తమ పిల్లలకు అకడమిక్ ఇయర్ నుంచి ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.