న్యూస్‌రీల్
నిజామాబాద్
ఉన్నత లక్ష్యాలను..
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు.
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
– 8లో u
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ విభాగాలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ సమీక్షలు ఏర్పాటు చేస్తూ బల్దియా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రెవెన్యూ పెండింగ్ ఫైళ్లను బయటికి తీయించిన ఆయన.. వివరాలను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలోనైనా బల్దియాలో ప్రక్షాళన సాధ్యమవుతుందా అని నగరవాసులు అంటున్నారు.
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపై ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేషన్‌కు నేరుగా వస్తూ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి ఫైల్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటుండడంతో బల్దియా అధికారుల వెన్నులో వణుకుపుడుతోంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల వివరాలను సైతం తెలుసుకుంటున్నారు. కార్పొరేషన్‌లో తరచూ రివ్యూలు నిర్వహిస్తున్న కలెక్టర్.. పెండింగ్ ఫైళ్లన్నీ బయటికి తీయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సుమారు 2వేల వరకు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించిన కలెక్టర్.. వాటిని వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. బుధవారం సైతం రివ్యూ నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్లు పెండింగ్‌లో లేకపోవడంపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. అనుమతులు లేకుండా బిల్డింగ్‌ల నిర్మాణం, ఆక్రమణల ప్రోత్సాహం, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ల పనితీరుపై అదే సమయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
బల్దియా అధికారులను కలెక్టర్ పరుగులు పెట్టిస్తుండడంతో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ ఫైళ్లకు ఎట్టికేలకు మోక్షం లభిస్తోంది. సుమారు 2 వే ల ఫైళ్లను బయటికి తీసిన అధికారులు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది మొత్తం గురువారం నుంచి వారం రోజులపాటు ఈ ఫైళ్ల క్లియరెన్స్ పనిలో ఉండనున్నట్లు తెలిసింది.
ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. షాపింగ్‌మాల్స్, పెద్ద వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు తీసుకోకుండానే వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఖలీల్‌వాడి, హైదరాబాద్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లో కార్పొరేట్ ఆస్పత్రులను ఎన్‌వోసీలు లేకుండానే ప్రారంభిస్తున్నారు.
హైదరాబాద్ రోడ్డులో ఇటీవల కొత్తగా వెలిసిన వస్త్రదుకాణం నుంచి ఫీజుతోపాటు మరో రూ.లక్ష అదనంగా తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ దీనిపై దృష్టి సారిస్తే బల్దియాకు ఆదాయం సమకూరడంతోపాటు అవినీతి అధికారుల ఆటలకు అడ్డుకట్ట పడుతుందని నగరవాసులు అంటున్నారు.
రెవెన్యూ విభాగంలో కొన్ని నెలలుగా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించాం. సరైన పత్రాలున్న వాటిని క్లియర్ చేయాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించాం. అనుమతుల్లో సమస్యలుంటే వెంటనే దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బల్దియా పాలనా వ్యవహారాలను ఎప్పటికప్పుడు ప్రత్యేకాధికారి, కలెక్టర్ నోటీసులో ఉంచుతున్నాం.
– దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది (ఫైల్)
రెవెన్యూలో..
బల్దియాకు గుండెకాయ వంటి విభాగమైన రెవెన్యూ సెక్షన్‌లో పైసలివ్వనిదే పని కావడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిపై పలువురు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టర్ కార్పొరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రెవెన్యూ సెక్షన్ ప్రక్షాళనకు కమిషనర్ దిలీప్ చర్యలు చేపట్టారు. ముందుగా రెవెన్యూ ఆఫీసర్ ఖయ్యూమ్‌ను ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్‌కు మార్చి ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ స్వప్నను ఆర్‌వోగా నియమించారు. అలాగే ఆర్‌ఐ బాధ్యతలను సీనియర్ అసిస్టెంట్ అనురాధకు అప్పగించారు.
కార్పొరేషన్‌లో రివ్యూలు నిర్వహిస్తూ అధికారులను
పరిగెత్తిస్తున్న జిల్లా కలెక్టర్
రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌పై దృష్టి
పెండింగ్ ఫైళ్లపై ఆరా
బల్దియా సిబ్బందిలో వణుకు
ప్రక్షాళన జరిగేనా!
ప్రక్షాళన జరిగేనా!
ప్రక్షాళన జరిగేనా!
ప్రక్షాళన జరిగేనా!