
ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, ఇది ప్రకృతి సౌందర్యాన్ని, సీ్త్రల ఐక్యత, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు. తెయూ ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో గురువారం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ యాదగిరిరావు, అతిథిగా రిజిస్ట్రార్ ఎం యాదగిరి హాజరై బతుకమ్మలకు పసుపు, కుంకుమ సమర్పించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించడమన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్‌ఆరతి, డీన్ ప్రొఫెసర్ కే.లావణ్య, అధ్యాపకురాళ్లు శాంతాబాయి, వాణి, ప్రసన్న శీలా, రాజేశ్వరి, జ్యోతి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ