
అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి రాకపోకల నిలిపివేత
అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో రోడ్డుకు
అడ్డంగా డ్రమ్ములు, బారికేడ్లు
రెంజల్(బోధన్) : మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టులతోపాటు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కందకుర్తి త్రివేణి సంగమంలో వరద పోటెత్తుతోంది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని నీరు ప్రవహిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గోదావరి నది పరీవాహక గ్రామాల్లో దండోరా వేయించారు. ప్రజలు, రైతులు, బర్ల, గోర్ల కాపరులు నది ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఎస్సై చంద్రమోహన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా రు. పుష్కరక్షేత్రంలోని సీతారాం త్యాగి ఆశ్రమం నుంచి సీతారాం త్యాగి మహరాజ్‌తోపాటు ఆయ న శిష్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.