మాటల తూటాలు | - | Sakshi
Sakshi News home page

మాటల తూటాలు

Sep 19 2025 2:46 AM | Updated on Sep 19 2025 2:46 AM

మాటల తూటాలు

మాటల తూటాలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఉమ్మడి జిల్లాలో మాటల తూటాలతో రాజకీయం గరంగరంగా మారింది. డీసీసీబీ మాజీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి తాజాగా చేసిన ప్రసంగం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బాన్సువాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు ప్రతిగా భాస్కర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరేమిటో తేల్చుకుందామంటూ భాస్కర్‌రెడ్డి సవాళ్లు విసిరాడు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ‘లక్ష్మీపుత్రుడు కాదు.. శని పుత్రుడు’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాస్కర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. జీవన్‌రెడ్డి ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. 2018లో 36 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జీవన్‌రెడ్డిని ప్రజలు గత ఎన్నికల్లో మూడోస్థానానికి నెట్టేశారన్నారు. జీవన్‌రెడ్డీ ఇదీ నీ బతుకు అంటూ వాఖ్యలు చేయడం గమనార్హం. నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించావు అంటూ ప్రశ్నించారు. జీవన్‌రెడ్డిని ఇంటరాగేట్‌ చేస్తే అతను చేసిన అసాంఘిక కార్యకలాపాలను కక్కేస్తాడన్నారు. భారీగా డబ్బులు సంపాదించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

● దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖం చూసి నాడు బాన్సువాడలో ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించారని భాస్కర్‌రెడ్డి అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్‌, షకీల్‌, ఏనుగు రవీందర్‌రెడ్డిలు కలిసి మంత్రి పదవిపై కన్నేసి పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు కుట్రలు చేశారన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి ఏ ఎండకా గొడు గు పడుతున్నాడన్నారు.

● వేముల ప్రశాంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉండి ఏం సాధించారంటూ ఎద్దేవా చేశారు. ప్రశాంత్‌ రెడ్డికి నిజామాబాద్‌ జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే గౌరవం ఇవ్వలేదన్నారు. కా మారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రమే గౌ రవించారన్నారు. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ప్రశాంత్‌రెడ్డి గెలుపొందారన్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న తనను దించేందుకు చేసిన కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు. ప్రశాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డికి పదవి కట్టబెట్టేందుకు తనకు వెన్నుపోటు పొడిచారన్నారు. పోచారం తండ్రిలాంటివారని చెప్పిన ప్రశాంత్‌రెడ్డి, మరి పోచారం కొడుకుకే వెన్నుపోటు పొడవడమేమిటన్నారు. రమేష్‌రెడ్డి ప్రాతిని ధ్యం వహిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సొంత ఊరు వే ల్పూర్‌ సొసైటీలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ పెట్టలేదన్నారు. పార్టీకి సైతం వె న్నుపోటు పొడిచారన్నారు. ఇది వాస్తవం కాదా అని భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏ గుడికి వచ్చి చెప్పమన్నా చెబుతా.. బాల్కొండ నియోజకవర్గానికి రమ్మంటావా.. బాన్సువాడ నియోజకవర్గానికి వస్తావా అంటూ భాస్కర్‌రెడ్డి సవా ల్‌ చేశారు. ఈ విషయమై హరీశ్‌రావు, కేటీఆర్‌ కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్‌ సమావేశంలో పోచారం భాస్కర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నివర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ మాటల యు ద్ధం మరింత ముదిరే అవకాశమున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డిపై పోచారం భాస్కర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉండి పూర్తిగా విఫలమయ్యారంటూ విమర్శలు

వెన్నుపోటుతో డీసీసీబీ పీఠం నుంచి తనను దించారంటూ ఆరోపణలు

వైఎస్‌ఆర్‌ ముఖం చూసి బాజిరెడ్డిని

గెలిపించారంటూ ఎద్దేవా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement