
ఒకే పోర్టల్‌లో స్కాలర్‌షిప్‌లు
ఖలీల్‌వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లను ఒకే దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇదివరకు ఉన్న ఎన్‌ఎస్‌పీ (నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్)ను అందుకు అనుకూలంగా మార్పు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల స్కాలర్‌షిప్‌ల కోసం ఇదే పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
దరఖాస్తు చేసుకోవడం ఇలా
ముందుగా ఎన్‌ఎస్‌పీ పోర్టల్‌లో అభ్యర్థి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. వచ్చిన అఫ్లికేషన్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, విద్యార్హతలు, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసి వాటిని అప్‌లోడ్ చేయాలి. ఒకటో తరగతి నుంచి పీజీ, పీహెచ్‌డీ వరకు చదివే అన్నివర్గాల విద్యార్థులు.. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, ఎంఎంఎన్‌ఎస్, టాప్‌క్లాస్ ఎడ్యుకేషన్(ఎస్సీ, ఎస్టీలకు), యూజీసీ, ఇషాన్, ఉదయ్, సింగిల్ గర్ల్ చైల్డ్, ఏఐసీటీఈ సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్ తదితర వాటన్నింటికీ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ అక్టోబర్ 31 వరకు తెరిచి ఉంటుంది.
సమాచారం..