
బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతోందని, దీనికి బా ధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగానికి సరిపడా యూరియాను తె ప్పించలేని బీజేపీ ఎంపీలు ఎందుకని ప్రశ్నించారు. వేల్పూర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. నెల రోజుల నుంచి బీఆర్‌ఎస్ తరఫున అన్ని వేదికల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మన్నారు. మళ్లీ చెప్పులు, పాస్‌బుక్కులు లైన్‌లలో పెట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే.. అర్వింద్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వద్ద పలుకుబడి ఉందని చెప్పుకునే ఆయన.. యూరియా కొరతపై ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. వెంటనే ప్రధానితో మాట్లాడి యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు లేదన్న ప్రశాంత్‌రెడ్డి.. బడే భాయ్ కు కోపం వస్తుందా? ఆయనకు కోపం వస్తే.. చోటేభాయ్‌కు జైలు శిక్ష పడుతుందా అని ఎద్దేవా చే శారు. ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ధ్యాస.. రైతులపై కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.
యూరియా ఎటువెళ్లింది..
జిల్లాకు 75వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 72వేల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, మరి వచ్చిన యూరియా ఎటు వెళ్లిందన్నారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్‌కు తరలించారా అని ఆరోపించారు. యూరియా సరిపడా సరఫరా చేసే సత్తా లేక.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు అవగాహన లేక రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు యూరియా కోసం లైన్ కట్టే పరిస్థితి రాలేదని, ముందు చూపుతో వ్యవహరించి సరిపడా తెప్పించారని గుర్తుచేశారు. పోలీస్‌స్టేషన్‌లో టోకెన్లు పంపిణీ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఉందా..? అని ప్రశ్నించారు. యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వెంటనే మంత్రులు బృందాన్ని పంపించి యూరియా సరిపడా అందుబాటులో ఉంచాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
యూరియా ఇప్పించలేని కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు?
అర్వింద్‌కు పలుకుబడి ఉంటే
యూరియా తెప్పించాలి
మళ్లీ చెప్పులు, పాస్‌బుక్‌లు
లైన్‌లో పెట్టే దౌర్భాగ్యం
కేసీఆర్ ముందుచూపుతో గతంలో యూరియా కొరత రాలేదు
మాజీ మంత్రి, బాల్కొండ
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి