
పేదలకు సన్న బియ్యం
‘సన్న బియ్యం’ పంపిణీ ద్వారా ప్రజలకు మరింత మేలు చేస్తున్నామని, రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా రూ.500 లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఈ పథకం కింద 2,19,330 గ్యాస్ వినియోగదారులకు, 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు రూ.30.73 కోట్లు ఖర్చు చేశామన్నారు.
● సన్న ధాన్యం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 29 లక్షల పంపు సెట్లకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకు గాను రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నామన్నారు. జిల్లాలో 2024–25 వానాకాలం సీజన్‌లో 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1,140 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. యాసంగి సీజన్‌లో 8,40,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,16,000 రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రూ.1,949 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.