అభివృద్ధి, సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

Sep 18 2025 7:59 AM | Updated on Sep 18 2025 7:59 AM

అభివృ

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అన్నివర్గాలకు

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి.

త్వరలో జీవాలకు..

రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ త్వరలో ప్రారంభం కాబోతోంది.

– 8లో u

మహిళల ఆరోగ్య

సంరక్షణే లక్ష్యం

నిజామాబాద్‌నాగారం: మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణే తమ లక్ష్యమని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా అన్నారు. స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వర్చుల్‌గా ప్రారంభించగా, కలెక్టరేట్‌ నుంచి బుధవారం ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం దుబ్బ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారు లతో కలిసి స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అక్టోబర్‌ 2వ తేదీ వరకు కొనసాగుతుందని, జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాల్లో వైద్యారోగ్య అధికారులు మహిళలకు సేవలందిస్తారన్నారు. కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీకి ఎమ్మెల్యే స్వస్త్‌ నారీ సశక్త్‌ సర్టిఫికెట్‌ను అందజేశారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ, జీజీహెచ్‌ సూపరిండెంట్‌ శ్రీనివాస్‌, డిప్యూ టీ డీఎంహెచ్‌వో అంజన, డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, వైద్యురాలు సుశానా, తాజా మాజీ కార్పొరేటర్‌ పంచరెడ్డి ప్రవళిక, శ్రీధర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కమీషన్‌లను

ప్రోత్సహించొద్దు

నిజామాబాద్‌నాగారం: రోగులను రిఫర్‌ చేసే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రు లు కమీషన్‌లు ఇస్తున్న ట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో రాజశ్రీ హెచ్చరించారు. స్కానింగ్‌, ఆస్పత్రుల్లో రిఫరల్‌ దందాలపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కావడంతో డీఎంహెచ్‌వో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమీషన్‌లను ప్రోత్సహించే ఆస్పత్రుల యాజమాన్యాలతోపాటు ప్రాక్టిషనర్లపై చర్యలుంటాయని హెచ్చరించారు. కమీషన్‌ దందాపై ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ మేరకు ఓ నిఘా బృందాన్ని సైతం నియమించినట్లు తెలిపారు.

లింగాపూర్‌ మత్స్య

సొసైటీ రద్దుకు నోటీసు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కోటగిరి మండలం లింగాపూర్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రద్దుకు జిల్లా మత్స్య శాఖ అధికారి నోటీసు జారీ చేశారు. సొసైటీలో 40 మంది సభ్యులు ఉండగా అందరూ ఇతర కులస్తులకు చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సొసైటీకి నోటీసు జారీ చేశారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన చేస్తున్నట్లు, ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజావ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తన ప్రసంగంలో నరేందర్‌ రెడ్డి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపారు. 1948 సెప్టె ంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గాంధీజీ కలులుగన్న గ్రామస్వరాజ్యం దిశగా వెళుతూనే, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంలో స్వర్గధామంగా పేరు తెచ్చుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో, పట్టణాల్లో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ‘ప్రజాపాలన’ పేరిట కార్యక్రమం తీసుకొచ్చామన్నారు.

రైతులకు రూ.755.29 కోట్ల రుణమాఫీ

రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1.13 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చరిత్ర సృష్టించామన్నారు. జిల్లాలో ఇప్ప టి వరకు 97,696 మంది రైతులకు 755.29 కోట్ల రుణమాఫీ అయిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ వానాకాలం సీజనులో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.316 కోట్లు జమ చేశామన్నారు.

● కీలక సంస్కరణల్లో ఒకటిగా భూభారతి చట్టం నిలిచిందన్నారు. దీని ద్వారా భూపరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేశామన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లల్లో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం ఇస్తున్నామన్నారు. తొలివిడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందుకు రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గ్రీన్‌ ఛానెల్‌లో నిధులు విడుదల చేస్తున్నామన్నారు. జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా, 18,155 ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు.

● గృహ జ్యోతి పథకం ద్వారా మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు ప్రతి నెల 2,67,707 మంది వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు మంజూరు చేశామన్నారు. ఇందుకు గాను రూ.174.90 కోట్లు విడుదల చేశామన్నారు.

● అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 760 పాఠశాలల్లో అత్యవసర మరమ్మతు పనులు చేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలో ఇప్పటివరకు రూ.22.20 కోట్లు వెచ్చించామన్నారు. మరోవైపు ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్‌, మోపాల్‌ మండలాల్లో కేజీబీవీల్లో ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టామన్నారు.

● జిల్లాలో కళ్యాణలక్ష్మి ద్వారా 2025–26లో 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు అందించామన్నారు. షాదీ ముబారక్‌ ద్వారా 672 మందికి రూ.6.72 కోట్లు ఇచ్చామన్నారు.

● కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, డాక్టర్‌ ఆర్‌ భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, కలెక్టర్‌ టి వినయ్‌ కష్ణారెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నవీపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సాంస్కృతిక ప్రదర్శన

సిద్ధార్థ కళాక్షేత్రం ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన

ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన

కీలక సంస్కరణగా నిలిచిన

భూభారతి చట్టం

ధాన్యం బోనస్‌, ఇందిరమ్మ ఇళ్లు,

గృహజ్యోతి పథకాలతో రైతులు,

మహిళలకు మరింత మేలు

ధాన్యం సేకరణలో ప్రథమ

స్థానంలో నిలిచిన జిల్లా

ముఖ్యమంత్రి సలహాదారు

వేం నరేందర్‌రెడ్డి

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు1
1/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు2
2/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు3
3/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు4
4/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు5
5/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు6
6/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు7
7/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు8
8/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు9
9/9

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement