
నిజామాబాద్
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
స్నేహమంటే ఇదేరా..
సుభాష్‌నగర్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్‌షిప్‌పై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. 50 మంది స్త్రీలు, మరో 50 మంది పురుషులను కలిసిన ‘సాక్షి’ ఫ్రెండ్‌షిప్‌పై అభిప్రాయాలను తెలుసుకుంది. వారంతా ఫ్రెండ్ షిప్‌పై అభిప్రాయాలను వెల్లడించారిలా..
మీనాక్షి నటరాజన్
నేటి కార్యక్రమాలు
ఆర్మూర్‌టౌన్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పొల్గొంటారు. ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రమదానం కార్యక్రమం, అంకాపూర్ గ్రామంలో ఉదయం 10.30 గంటలకు జెండా ఆవిష్కరణ, తేనేటి విందులో పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు అర్గుల్ రోడ్డులో గల పీవీఆర్ గార్డెన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశంలో మీనాక్షి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియెజకవర్గ ఇన్‌చార్జి పొద్దూటూరి వినయ్‌రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ అభివృద్ధికి
కృషిచేయాలి
ఆర్మూర్‌టౌన్: ఆర్టీసీని మరింత అభివృద్ధి చేయడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని రీజినల్ మేనేజర్ జోత్స్న అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శనివారం ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీని అదరించాలన్నారు. అనంతరం పలువురు ఉద్యోగులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఆర్మూర్, నిజామాబాద్–1, 2, బోధన్, బాన్సువాడ, కామరెడ్డి డిపో డిపోమేనేజర్‌లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి ●
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్
రుద్రూర్: ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ సూచించారు. పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో శనివారం కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం నిర్వహించారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా డీఏవో గోవింద్ మాట్లాడుతూ వ్యవసాయ పనుల కోసం 20 విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా జిల్లాకు రూ.17 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు. రైతులు పంటల్లో యూరియా వినియోగం తగ్గించి నానో యూరియా వాడకంపై దృష్టి సారించాలని సూచించారు. సస్యరక్షణ శాస్త్రవేత్త విజయ్ కుమార్ మాట్లాడుతూ సోయా చిక్కుడు, వరి పంటలలో పురుగు మందుల పిచికారీ తగ్గించి వివిధ సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇంచార్జి ఇందూధర్ రెడ్డి, విస్తరణ శాస్త్రవేత్త శ్వేత, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఏవో, శాస్త్రవేత్తల బృందం హెగ్డోలి శివారులోని పంట పొలాలను పరిశీలించారు.
● ఫ్రెండ్ షిప్ అంటే.. మీ దృష్టిలో..
ఏ) కల్మషం
లేనిది (71 మంది)
బీ)అవసరాలు
తీర్చేది (29 మంది)
● ఫ్రెండ్‌షిప్ కూడా.. కలుషితమైందా..!
ఏ) అవును (64)
బీ)లేదు (36)
● నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు..
ఏ)ఒకరు (28)
బీ)ఇద్దరికి మించి (72)
● నీ ఫ్రెండ్‌కు ఇచ్చే స్థానం..?
ఏ) అమ్మ, నాన్న,
ఫ్రెండ్ (50)
(బీ) ఫ్రెండ్,
అమ్మ, నాన్న (10)
(సీ) నాన్న, అమ్మ, (40)
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండలంలోని దూస్‌గాం గ్రామానికి చెందిన 21 మంది స్నేహితులు తమ ఊరి అభివృద్ధి, సమాజ సేవే లక్ష్యంగా సూర్య యూత్‌ను ఏర్పాటు చేశారు. 2007లో సూర్య యూత్ పేరుతో బృందంగా ఏర్పడిన వా రంతా ప్రతినెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంకు నిర్మించారు. ప్రతి ఏడాది గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నా రు. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియ ల వరకు మృతదేహాన్ని భద్రపర్చేందుకు అవసరమైన ఫ్రీజర్‌ను అందజేశారు.పేద కుటుంబాలకు చెందిన ఇంటిపెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి తమ వంతుగా రూ.5వేల నుంచి రూ.10వేల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇలా గత 18 సంవత్సరాలుగా స్నేహితులైన సూర్య యూత్ స భ్యులు గ్రామాభివృద్ధితో పాటు సమాజ సేవ కు పాటుపడుతున్నారు. ప్రస్తుతం యూత్ అధ్య క్షుడిగా కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా టి.సాయిలు, ప్రధాన కార్యదర్శిగా గద్దె సత్యనారా యణ, కోశాధికారిగా జి.రాజు వ్యహరిస్తున్నారు.
న్యూస్‌రీల్
గ్రామాభివృద్ధి, సమాజ సేవ సూర్యయూత్
ఊరికి సేవలందిస్తున్న మిత్రులు
జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటలు (ఎకరాల్లో)

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్