
పంటల నమోదు ఇంకెప్పుడు?
డొంకేశ్వర్(ఆర్మూర్): ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల సాగు దాదాపు పూర్తయింది. పసుపు, సోయా, మొక్కజొన్న పంటలను రైతులు ఎప్పుడో వేయగా, వరి నాట్లు చివరి దశలో ఉన్నాయి. అయితే ఏ రైతు ఏ పంట వేశాడు? ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఇంకా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. జూన్‌లోనే మొదలు కావాల్సిన పంటల నమోదు కార్యక్రమం ఆగస్టు వచ్చినా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే పోర్టల్‌ను మూసి ఉంచడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పంటల నమోదు చేయలేకపోతున్నా రు. ప్రభుత్వం పోర్టల్‌ను ఎప్పుడు తెరిచి గైడ్‌లెన్స్ ఇస్తుందో అధికారులకూ తెలియని పరిస్థితి. ఆలస్యమైతే మక్క, సోయా లాంటి పంటల కోతలు మొదలవుతాయి. జిల్లాలో ప్రధాన పంటలన్నీ కలిపి 5 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసే పంటలను ప్ర భుత్వం కొనే ముందు సర్వేను చే స్తుంది. ఇందుకు డీసీఎస్ అనే ప్రత్యే క యాప్‌ను రూపొందించింది. పంటల వివరాలు నమోదు చేస్తే ఏ పంట ఎంత దిగుబడి వచ్చే అవ కాశముంది, ఎన్ని కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలో ప్రభు త్వం నిర్ణయిస్తుంది. ఖరీఫ్ సీజన్ పంటల నమోదుకు ప్రభుత్వం సైట్‌ను ఎందుకు తెరవడం లేదని డీఏవో గో వింద్‌ను సంప్రదించగా.. అప్‌డేషన్ జరుగుతున్నట్లుగా తమకు సమాచారం ఉందని తెలిపారు.
జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటలు (ఎకరాల్లో)
వెబ్‌సైట్ మూసి ఉంచిన ప్రభుత్వం
మొదలుకాని ఖరీఫ్ క్రాప్ బుకింగ్
గైడ్‌లైన్స్ కోసం ఏఈవోల
ఎదురుచూపులు