
అయ్యప్ప కలిపిన స్నేహం
సుభాష్‌నగర్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ప్రముఖ వ్యాపారి, సామాజిక సేవకుడు మంచాల జ్ఞానేందర్ స్నేహబంధానికి 30ఏళ్లు. అయ్యప్ప మాలధారణ మొదటిసారి వారిరువురిని కలిపింది. ఆ తర్వాత మరో 14 ఏళ్లు వరుసగా అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో వారి మధ్య స్నేహబంధం ధృడమైంది. వారి స్నేహం ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్‌గా మారింది. స్వతహాగా వ్యా పారి అయిన ధన్‌పాల్ తన తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకున్న మంచాల జ్ఞానేందర్ సైతం తన తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. నగరంలోని అమ్మనగర్‌లో వారాహి మాతా ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
నిజామాబాద్ నగరానికి చెందిన బైక్ మెకాని క్, గురు స్వామి ధాత్రిక రతన్, బీర్కూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సుధాకర్ యాదవ్ స్నేహం శబరి మల పాదయాత్ర తో ధృడమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారు డు వైఎస్ జగన్ 2010లో ప్రారంభించిన వైఎస్‌ఆర్‌సీపీలో వీరిరువురికి పరిచయం ఏర్పడింది. 15 ఏ ళ్లలో నాలుగు సార్లు శబరిమలకు, ఒకసారి షిర్డీకి పాదయాత్ర చేపట్టడంతో వారి మధ్య స్నేహం బలపడింది. ఇద్దరూ కలిసి అయ్యప్ప మాల ధరిస్తూ, దీ క్ష పూర్తి కాగానే తీర్థయాత్రలకు బయల్దేరుతారు. తాజాగా అమర్‌నాథ్, కేదర్‌నాథ్, బద్రినాథ్, ఇతర తీర్థయాత్రలు కలిసే చేసుకున్నారు. ఇరు కుటుంబా ల మధ్య విడదీయలేని స్నేహబంధం ఏర్పడింది.

అయ్యప్ప కలిపిన స్నేహం

అయ్యప్ప కలిపిన స్నేహం