
సొసైటీల ఆర్థిక స్థితిపై ఆరా!
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఆరా తీ స్తోంది. అప్పుల బకాయిలు, నిల్వల వివరాలను సమర్పించాలని సీఈవోలను ఆదేశించింది. ఇందుకోసం మూడు రోజుల క్రితం ప్రత్యేక ఆన్‌లైన్ ఫా ర్మాట్‌ను ఇవ్వగా, అందులో సొసైటీల్లో నిల్వ ఉన్న నగదు, బకాయిలు, అప్పులు తీసుకున్న డైరెక్టర్ల వి వరాలను ఎంట్రీ చేసి ప్రభుత్వానికి పంపుతున్నా రు. అయితే ప్రభుత్వం ఈ వివరాలను ఎందుకు సేకరిస్తుందో సంబంధిత అధికారులకు కూడా తెలియడం లేదు. బకాయిలు చెల్లించని డైరెక్టర్ల పేర్లను అడగడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనన్న ఆసక్తి నెలకొంది.
పదవీకాలాన్ని పొడిగిస్తారా?
సొసైటీ పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఆరు నెలలు పెంచింది. ఈనెల 14వ తేదీతో పదవీకాలం ముగియనుండగా పది రోజుల ముందుగానే సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం ఆరా తీయడం సొసైటీల్లో చర్చనీయాంశమైంది. మరో ఆరు నెలలపాటు పాలకవర్గాల పదవీకాలం పొడగింపు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహణకు ఆసక్తి చూపకపోవడం, కనీసం ఆ దిశగా చర్యలు కూడా చేపట్టకపోవడం చూస్తుంటే పదవీకాలం పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో మొత్తం 89 సొసైటీలు ఉండగా ఇందులో 2.70లక్షల మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీల పదవీకాలం నిబంధనల ప్రకారం ఐదేళ్లు మాత్రమే అయినప్పటికీ ఇప్పటికే పదవీకాలాన్ని ఒకసారి పొడిగించింది. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్‌రావును వివరణ కోరగా... ప్రభుత్వం అడిగిన సొసైటీల ఆర్థిక వివరాలు సీఈవోలు పంపించారని, పాలకవర్గాల పదవీకాలం పొడగింపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
బకాయిలు, నిల్వల వివరాలు
కోరిన ప్రభుత్వం
పది రోజుల్లో ముగియనున్న
పాలకవర్గాల పదవీకాలం