ప్రభుత్వ ఆఫీసుల్లో మూవ్‌మెంట్‌ రిజిస్టర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆఫీసుల్లో మూవ్‌మెంట్‌ రిజిస్టర్లు

Aug 5 2025 8:42 AM | Updated on Aug 5 2025 8:42 AM

ప్రభు

ప్రభుత్వ ఆఫీసుల్లో మూవ్‌మెంట్‌ రిజిస్టర్లు

రెంజల్‌(బోధన్‌): జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మూవ్‌మెంట్‌ రిజిస్టర్లను ఏర్పాటు చే యాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆ దేశించారు. గ్రామ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. మండల కేంద్రమైన రెంజల్‌తోపాటు వీరన్నగుట్ట లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సోమవారం పర్యటించి హైస్కూల్‌, అంగన్‌వాడీ సెంటర్లు, పీహెచ్‌సీని త నిఖీ చేశారు. వీరన్నగుట్టలో హైస్కూల్‌తోపాటు అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌.. బో ధన, బోధనేతర సిబ్బంది హాజరును ఫేషియల్‌ రికగ్నిషన్‌(ముఖ గుర్తింపు) విధానం ద్వారా నమోదు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. టాయిలెట్స్‌, కిచెన్‌, తరగతి గదులను పరిశీలించి వాటిని శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని స్కూ ల్‌ హెచ్‌ఎంను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు అవసరమైన ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పంపించాలని సూ చించారు. అనంతరం రెంజల్‌లోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్‌సీ డాక్టర్‌తోపాటు కొంత మంది సిబ్బంది లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్‌ హాజ రు రిజిస్టర్‌ను తనిఖీ చేసి వారందరికీ అబ్సెంట్‌ వే శారు. డాక్టర్‌ ఉదయం నుంచి విధులకు హాజరుకాలేదని తెలుసుకున్న ఆయన వెంటనే డీఎంహెచ్‌వోతో ఫొన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో టీచర్‌ అందుబాటులో లేకపోవడంతో సీడీపీవోకు ఫోన్‌ చేశారు. టీచర్‌పై చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. అనంతరం సొసైటీ గోడౌన్‌ను సందర్శించి ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

రెంజల్‌ మండలంలో పర్యటన.. తనిఖీలు

విధులకు డుమ్మా కొట్టిన పీహెచ్‌సీ వైద్యుడు, అంగన్‌వాడీ టీచర్‌

చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో, సీడీపీవోకు ఆదేశాలు

ప్రభుత్వ ఆఫీసుల్లో మూవ్‌మెంట్‌ రిజిస్టర్లు 1
1/1

ప్రభుత్వ ఆఫీసుల్లో మూవ్‌మెంట్‌ రిజిస్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement