
ఆయకట్టుకు ‘సాగర్’ నీరు
బాన్సువాడ : ప్రస్తుతం నెలకొన్న వర్షభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిజాంసాగర్ ఆయకట్ట కింద పంటలను కాపాడేందుకు ప్రాజెక్టునుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాన్సువాడ ఎత్తిపోతల పథకం పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడడంతో చివరి ఆయకట్టకు నీరందడం లేదని రైతులు పోచారం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సోమవారం పైప్‌లైన్‌ను పరిశీలించారు. పైపులైన్ వేసి చాలాకాలం కావడంతో అక్కడక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయని, కొత్తపైపు లైన్ ఏర్పాటు, మోటార్ల కోసం ప్రతిపాదనలు పంపామని పోచారం తెలిపారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలు ఎండకుండా చూసేందుకు పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తామన్నారు. నిజాంసాగర్ నుంచి విడుదల చేసే నీటిని వృథా చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు మోహన్‌నాయక్, దాసరి శ్రీనివాస్, గులెపల్లి శంకర్, రైతులు రెంజర్ల సాయిలు, గొల్ల సాయిలు, నర్సగొండ, అశోక్‌రెడ్డి, నగేష్, రాజు, సత్యపాల్‌రెడ్డి, రఘువీర్, ధనగారి రాజు, గులెపల్లి గంగాధర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి విడుదల
ప్రభుత్వ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి