
జంబిహనుమాన్ ఆలయ అధికారులపై విచారణ
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయంలో గతేడాది జరిగిన చోరీపై మంగళవారం ఆలయ అధికారులను ఎండోమెంట్ అధికారులు విచారించారు. ఆలయంలో గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన చోరీపై గతంలో శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి ఎండోమెంట్ అఽధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా దేవాదాయ శాఖ విచారణ అధికారి అంజలిదేవి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్‌రామరావు ఆలయంలో ఈవో రవీంధర్, జూనియర్ అసిస్టెంట్ హరితరాణి, అటెండర్ గోపిపై విచారణ చేపట్టారు. శివసేన పార్టీ నాయకుల, అధికారుల పరస్పర ఆరోపణలను విచారణ అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ నివేదికను ఎండోమెంట్ కమిషనర్‌కు ఇవ్వనున్నట్లు అంజలిదేవి తెలిపారు. అలాగే ఈవో రవీంధర్‌ను, జూనియర్ అసిస్టెంట్ హరితరాణిని, అటెండర్ గోపిలను సస్పెండ్ చేయాలని శివసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విచారణలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారయణ, అయ్యప్ప సేవాసమితి సభ్యులు, పంతులు నర్సింగ్‌రావు పాల్గొన్నారు.