ఆర్మూర్: ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్‌గా అభిగ్యన్ మాల్వియా ఐఏఎస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, అధికారులు అభినందనలు తెలిపారు.
హైవేపై పల్టీలు కొట్టిన కారు
ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ హమీద్, షేక్ నదీప్, షేక్ అలీ ముగ్గురు కలిసి మంగళవారం ఉదయం శంషాబాద్ ఏయిర్‌పోర్టు నుంచి నిజామాబాద్‌కు బయలుదేరారు. గన్నారం గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు.
బాధ్యతల స్వీకరణ