
పరుచుకున్న పచ్చదనం
వర్షాకాలంలో ఎక్కడ చూసినా పచ్చదనం నిండుగా పరుచుకుంటుంది. పల్లెలు పచ్చని కోకను చుట్టుకున్నట్లు ప్రకృతి కాంతతో మమేకమై కనిపిస్తుంటాయి. నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా గాంధారి మండలంకు వెళ్లే దారిలో బీర్మల్‌తండా, గుర్జాల్ తండా , చిన్నగుర్జల్ తండా, యాచారం తండాల చుట్టూ పచ్చదనం పరుచుకుంది. ఈ తండాల్లో వర్షాకాలం వచ్చిందంటే మక్క, పత్తి, సోయా పంటలను గిరిజనులు సాగుచేస్తారు. ఈక్రమంలో పచ్చని పంటపొలాల మధ్య తండాలు పచ్చదనంతో ఆహ్లాదంగా మారాయి. ఈ సుందర దృశ్యాన్ని సాక్షి మంగళవారం క్లిక్‌మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్