
ముగిసిన విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ
నిజామాబాద్‌నాగారం: నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. విద్యుత్ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రవీంధర్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన జట్లు పోటీ పడగా, విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. రన్నర్‌గా నిజామాబాద్, మూడో స్థానంలో కరీంనగర్ జట్లు నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్‌శాఖ ఓఎంసీ పీవీ రావు హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. అనంతరం సామాజిక కార్యక్రమాలు చేసిన, జాతీయస్థాయి అవార్డు గ్రహీత తోట రాజశేఖర్‌ను సత్కరించారు. డీఈలు రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తోట రాజశేఖర్, ఏవో గంగారాం, సురేష్ కుమార్, శంకర్ నాయక్, గోపి, ఉత్తమ్, దినేష్, మూర్తి, సీనయ్య, సతీష్, సుభాన్, పఠాన్, సత్యనారాయణ, స్వామి ,శ్రీకాంత్, హరీష్, గంగాధర్ తదితరులు ఉన్నారు.
విజేతగా నిలిచిన వరంగల్ జట్టు
రన్నర్‌గా నిజామాబాద్

ముగిసిన విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ