
క్రీడాపోటీలతో సత్సంబంధాలు
నిజామాబాద్‌నాగారం: క్రీడాపోటీలతో ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతాయని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని క్రీడల ద్వారా అధిగమించొచ్చని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఎస్‌ఈ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నీని సీపీ సోమవారం ప్రారంభించారు. ముందుగా క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కష్టపడే విద్యుత్ ఉద్యోగుల్లో ఈ తరహా టోర్నీల నిర్వహణతో కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. ఉద్యోగులు, సిబ్బందిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్న విద్యుత్‌సంస్థ సీఎండీ అభినందనీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఆపరేషన్ కామారెడ్డి శ్రావణ్ కుమార్, ఎస్‌ఈ ఓఎంసీ పీవీ రావు, అడిషనల్ డీసీపీ కే రామచంద్రరావు, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, డీఈలు ఏ రమేశ్, విక్రమ్, టోర్నీ ఆర్గనైజర్, ఏడీఈ తోట రాజశేఖర్, ఏఏవో గంగారం నాయక్ తదితరులు పాల్గొన్నారు. మొదటిరోజు టోర్నీలో నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ వరంగల్ జిల్లాల విద్యుత్ క్రీడాకారులు పాల్గొన్నారు.
కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య
అట్టహాసంగా ప్రారంభమైన
విద్యుత్ హాకీ టోర్నీ

క్రీడాపోటీలతో సత్సంబంధాలు