
అహ్మదాబాద్ నుంచి..
కంటైనర్‌లో నుంచి బ్యాలెట్ బాక్సులను దించుతున్న సిబ్బంది
● నాలుగు కంటైనర్లు.. 3,440 బ్యాలెట్ బాక్సులు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ.. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి 4 కంటైనర్లలో 3,440 బ్యాలెట్ బాక్సులు (పెద్దవి) సోమవారం జిల్లా కేంద్రానికి చేరాయి. కలెక్టరేట్, జిల్లాపరిషత్‌లోని గదుల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు. జిల్లాలో ఇప్పటికే 2,530 పెద్ద, 1315 చిన్న బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండగా, మరో 1200 బాక్సులు వస్తాయని జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే మండల కేంద్రాలు, పంచాయతీలకు బాక్సులను తరలిస్తామని పేర్కొన్నారు. – సుభాష్‌నగర్

అహ్మదాబాద్ నుంచి..