
ఏదీ బోనస్
– 8లో u
యాసంగి పంటపోయి వానాకాలం నాట్లు పూర్తవుతున్నా ‘బోనస్’ మాటలకే పరిమితమైంది. ఇదిగో వేస్తాం.. అదిగో వేస్తామంటూ సంబంధిత మంత్రి ప్రకటిస్తుండడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. సన్నాలు సాగు చేస్తే పంట దిగుబడి తక్కువగా వస్తుందని తెలిసీ.. బోనస్ ఆశతో వానాకాలంలో సైతం రైతులు సన్నాలను విస్తృతంగా సాగు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సన్నధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. బోనస్ డబ్బుల చెల్లింపు విషయంలో ఆలస్యం అవుతుండడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. రూ.500 బోనస్ ఇస్తుండడంతో గత యాసంగిలో జిల్లాలో రైతులు భారీగా సన్నధాన్యం సాగు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో రూ.1949.09 కోట్ల విలువైన ధాన్యం సేకరణ జరిగింది. కాగా ఇందులో సన్నధాన్యం 7,38,662 మెట్రిక్ టన్నులు ఉంది. ఇక 1,01,481 మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం సేకరించారు. ధాన్యం డబ్బులు మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లింపు మాత్రం ఆలస్యం అవుతోంది. బోనస్ చెల్లింపుల విషయానికి వస్తే జిల్లాలో 1,04,751 మంది రైతులకు రూ.369.38 కోట్లు ఇవ్వాల్సి ఉంది. యాసంగి సీజన్ బోనస్ రాకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. బోనస్ వస్తుందనే ఆశతో రైతు లు దొడ్డు ధాన్యం బదులు అత్యధికంగా సన్నధా న్యం సాగు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో సాధారణ వరి సాగు సుమారు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో దాదాపు 95 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. కాగా ప్రభు త్వం మాత్రం ఇప్పటివరకు బోనస్ చెల్లించే విషయంలో ఆలస్యం చేస్తుండడం పై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బోనస్ చెల్లింపులు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుసార్లు చెప్పినప్పటికీ మాటలకే పరిమితమవుతూ ఆలస్యం చేస్తుండడం ఏమిటని రైతులు అంటున్నారు. తక్షణమే బోనస్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఏదీ బోనస్