
ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి
ఖలీల్‌వాడి: ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పదవీ విరమణ పొందిన ఏఎస్సై మురళిధర్ రాజు(వేల్పూర్), ఏఆర్ ఎస్సై నర్సింలు(పోలీస్ హెడ్ క్వార్టర్స్), ఏఆర్ ఎస్సై సత్యనారాయణ గౌడ్(హెడ్ క్వార్టర్స్)ను సీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి పని ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయమని అన్నారు. పదవీ విరమణ పొందిన సిబ్బందికి పోలీస్‌శాఖ ఎల్లప్పుడు సహాయంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వు సీఐ శ్రీనివాస్, తిరుపతి, సతీశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.