
అందుబాటులో రైతులకు సరిపడ ఎరువుల నిల్వలు
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
● మోపాల్‌లో గోదాం తనిఖీ
నిజామాబాద్ రూరల్: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లా రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మోపాల్ సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఎరువుల విక్రయాలను ఈ–పాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి, ఎరువులను తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా, ఎరువుల నిల్వలతో కూడిన వివరాలను స్టాక్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు.
లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వండి
ఖలీల్‌వాడి: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైన లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ గురువారం తెలిపారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడళ్లతోపాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలకు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి సంబందించిన స్టిక్కర్‌లను అతికించామన్నారు. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైన పని నిమిత్తం వెళితే, అధికారులు, సిబ్బంది పని పూర్తి చేయించడం కోసం లంచం డబ్బులు డిమాండ్ చేసినచో అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. లేదు నేరుగా టోల్ ఫ్రీ నంబర్‌కు గాని లేదా నిజామాబాద్ రేంజ్‌కి చెందిన అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

అందుబాటులో రైతులకు సరిపడ ఎరువుల నిల్వలు