
కలెక్టర్ వచ్చి టీసీ ఇప్పించే..
● ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు నిరాకరణ
● ప్రైవేట్ కళాశాలకు వెళ్లి ఆరా తీసిన
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని శ్రీభాషిత జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసిన 15 మంది విద్యార్థులు ఫీజుల భారాన్ని భరించలేక ప్ర భుత్వ కళాశాలకు వెళ్లాలనుకున్నారు. టీసీల కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేట్ కళాశాల యాజమా న్యం నిరాకరించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి బుధవారంతో గడువు ముగుస్తుందని ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ వెళ్తుండడాన్ని గమనించిన ఆ విద్యార్థులు వాహనాన్ని ఆపి తమ గోడును వెళ్లబోసుకున్నారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వెంటనే ప్రైవేట్ కళాశాలకు వెళ్లారు. టీసీలు ఇవ్వకుండా వి ద్యార్థులను పక్షం రోజులుగా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చిన కాలేజీలో చదివే స్వేచ్ఛ విద్యార్థులకు ఉందని, సె కండియర్ కూడా మీ కాలేజీలోనే చదవాలని బలవంతం చేయడం సమంజసం కాదన్నారు. విద్యార్థులకు ఇప్పటికిప్పుడు టీసీలు ఇవ్వాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ ప్రసాద్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మధుకుమార్‌ను అక్కడికి పిలిపించుకుని వి ద్యార్థులకు వెంటనే టీసీలు ఇప్పించి, ప్రభుత్వ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాల ని ఆదేశించి వెళ్లారు. తహసీల్దార్ అక్కడే ఉండి విద్యార్థులకు టీసీలు ఇప్పించి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ఇప్పించడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.