
బర్త్‌డే వేడుకల్లో కత్తులతో వీరంగం
● సోషల్ మీడియాలో వైరల్
● నాలుగేళ్ల క్రితం వీడియోగా
పోలీసుల నిర్ధారణ!
● వైరల్ చేసిన వారిపై పోలీసుల ఆరా..
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌లో రౌడీ షీటర్లు బర్త్‌డే వేడుకల్లో తల్వార్‌తో కేక్ కట్ చేయడమే కాకుండా ఊరేగింపుతో హల్‌చల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు అప్రమత్తమై, ఆరా తీస్తున్నారు. ఈ వీడియో సోమవారం నాటిదని కొందరు చెబుతుండగా, నాలుగేళ్ల క్రితం వీడియో అని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
వీడియోలో ఏముందంటే..
నగరంలోని ఆటోనగర్‌లో రౌడీ షీటర్ ఆరిఫ్ గ్యాంగ్ సభ్యుడు అప్పు తన బర్త్ డే సందర్భంగా బైక్‌పై తల్వార్ పట్టుకొని ర్యాలీగా వచ్చారు. అనంతరం కేక్‌ను తల్వార్‌తో కట్ చేసి తినిపించారు. ఈ వీడి యోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వారిపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిసింది. తల్వార్‌తో హల్‌చల్ చేసిన వ్యక్తిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అప్పు కోసం పోలీసుల బృందం గాలింపు చ ర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నగరంలో గతంలో జంగిల్ ఇబ్బు ఆలియాస్ ఇబ్రహీం ఛావూస్, ఆరిఫ్ డాన్ వేర్వేరుగా గ్యాంగ్‌లను నడిపించారు. ఆరిఫ్ డాన్, జంగిల్ ఇబ్బులు మృతిచెందినా వారి అనుచరులు ఈ గ్యాంగ్‌లను కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.