
ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్ రూరల్: ఆలయాల అభివృద్ధికి చైర్మన్‌తో సహా కమిటీ సభ్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నగరంలోని జెండా బాలాజీ, శంభుని గుడి, సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఆయా ఆలయాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. మూడు ఆలయాలు చాలా మహిమలుగలవని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్‌గా లవంగ ప్రమోద్ కుమార్, డైరెక్టర్లుగా పాలకొండ నర్సింగరావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్, పవర్ విజయ, కోరవ రాజ్‌కుమార్, శంభుని గుడి ఆలయ కమిటీ చైర్మన్ బింగి మధు, డైరెక్టర్లుగా గాజుల కిశోర్, గాండ్ల సంతోష్ కుమార్, కమల్ కిశోర్ దయ్మా, మామిడి శేఖర్, ఉప్పల రమేశ్, గోపు రేఖ, సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్‌గా బొత్కం గంగాకిషన్, డైరెక్టర్లుగా శ్రీరాం రమేశ్, గాదె ప్రవీణ్ కుమార్, బాణాల శివ లింగం, కోల్తే శాంతాబాయిలతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతి రాజిరెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి