
60 వసంతాల ఆర్మూర్ మార్కెట్ యార్డు
మీకు తెలుసా?
ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంతంలోని రైతాంగం పండించిన పంటను అమ్ముకోవడానికి అనువుగా ఆర్మూర్ పట్టణంలో 1965 జూలై 6న వ్యవసాయ మార్కెట్ యార్డును నెలకొల్పారు.
● రైతులు తమ పంటల విక్రయాలు నిర్వహించుకోవడానికి 11.07 ఎకరాల సువిశాలమైన స్థలంలో యార్డును ఏర్పాటు చేశారు.
● ఆర్మూర్ మార్కెట్ యార్డు స్థాపించిన సమయంలో ఆర్మూర్, బాల్కొండ, వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి మండలాలు ఈ యార్డు పరిఽధిలో ఉండేవి.
● ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్ మండలం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్పల్లి మండలం మాత్రమే ఉన్నాయి.
● ఏఎంసీ పరిధిలో వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాం, 600 మెట్రిక్ టన్నుల గోదాం, 200 మెట్రిక్ టన్నుల గోదాములు ఉన్నాయి. వెయ్యి మెట్రిక్ టన్నుల గోదామును సివిల్ సప్లై వారికి అద్దెకు కేటాయించారు. మిగిలిన రెండు గోదాములు ఐడీసీఎంఎస్ వారు అద్దెకు తీసుకున్నారు.