
సరిపడా ఎరువుల నిల్వలు
● బఫర్ స్టాక్ అందుబాటులో
ఉంచిన వ్యవసాయ శాఖ
● మరోవైపు దశల వారీగా
దిగుమతికి ప్రణాళిక
డొంకేశ్వర్(ఆర్మూర్): వానాకాలం ఎరువులను తెప్పించడానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. జిల్లాకు అవసరమైన ఎరువులను దశల వారీగా దిగుమతి చేసుకునేందుకు ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే బఫర్ స్టాక్‌ను అందుబాటులో ఉంచగా, రానున్న ఎరువులను నిల్వ చేసేందుకు గోదాములను సిద్ధం చే స్తోంది. ఖరీఫ్‌లో 5.21 లక్షల ఎక రాల్లో ఆయా రకాల పంటలు సా గవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అత్యధికంగా 4.32 లక్షల ఎకరాలకు పైగా వరి సాగయ్యే అవకా శం ఉన్నట్లు తెలిపింది. యూరియా 75,499 మెట్రిక్ టన్నులు, డీఏపీ 13,072 మెట్రిక్ టన్నులు, పొటాష్ 13,105 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 44,480 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,452 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని అంచనా వేసింది. అందుకు తగ్గట్లుగా అధికారులు ఎరువులు తెప్పించే పనిలో ఉన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బోధన్ డివిజన్‌లో మరో వారం, పది రోజుల్లో నాట్లు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మిగతా డివిజన్లలో కూ డా రైతులు నారు పోస్తున్నారు. మక్క, సోయా విత్తనాలు విత్తేందుకు రెడీగా ఉన్నారు. యూరి యా, ఇతర ఎరువుల కొనుగోళ్లు కూడా మొదలయ్యాయి. జూన్, జూలై లో నాట్లు ఎక్కు వగా పడే అవకాశం ఉండడంతో జిల్లాకు ఎక్కువగా యూరియాను తెప్పించడానికి అధికారులు కరసరత్తు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత ఏర్పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి ‘సాక్షి’కి తెలిపారు. రైతులు సరిపడా బస్తాలను మాత్రమే తీసుకెళ్లాలని అవసరానికి మించి తీసుకెళ్లవద్దని ఆయన సూచించారు.
యూరియా 24,136
డీఏపీ 5,380
పొటాష్ 2,142
కాంప్లెక్స్ 39,592
ప్రస్తుతం
ఎరువుల నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో)