
జిల్లాలో 32 మి.మీల వర్షం
● అత్యధికంగా ధర్పల్లిలో..
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో శుక్రవా రం 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అత్యధికంగా ధర్పల్లి మండలంలో 88.3, ఆర్మూర్‌లో 64.2, నవీపేటలో 62, సిరికొండలో 63, భీమ్‌గల్‌లో 54, కమ్మర్‌పల్లిలో 49 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అతి తక్కువగా సాలూర మండలంలో 1.3 మి.మీ, డొంకేశ్వర్‌లో 2.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మధ్యాహ్న భోజన నిధులు విడుదల
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలలకు చెందిన మధ్యాహ్న భోజన నిధులు విడుదల చేసినట్లు డీఈవో అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి ఈసీహెచ్‌ల గౌరవ వేతనం రూ.59 లక్షల 27 వేల నిధులను మండలాల వారీ రిలీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఎస్బీ ఏసీపీ
శ్రీనివాస్‌రావు బదిలీ
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్‌కమిషనరేట్‌లో స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీగా పని చేస్తున్న శ్రీనివాస్‌రావు బదిలీ అయ్యా రు. శ్రీనివాస్‌రావుకు ఇటీవల అదనపు ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. దీంతో నిజామాబాద్ కమిషనరేట్‌లోనే ఎస్బీ ఏసీపీగా కొనసాగారు. గురువారం రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా శ్రీనివాస్‌రావును హైదరాబాద్‌లోని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా నియమించారు.