ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ విఫలం
ఇందల్వాయి: వరిధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ విమర్శించారు. ఇందల్వాయి కొనుగోలు కేంద్రంలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంట కొనుగోళ్లలో ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చిన్ను, మాజీ అధ్యక్షుడు నాయిడి రాజన్న, అశోక్, గోపి తదితరులున్నారు.


