
వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రం ఐటీఐ గ్రౌండ్ బ్రాహ్మణ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇటీవ ల పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ విజయానికి సహకరించిన త్రివిధ దళాల సైనికులు వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని, లోక కల్యాణం కోసం హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షస్తోత్రం, కాలబైరవ అష్టకాలను సామూహిక పారాయణం చేశారు. రఘునాథ అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ కోశాధికారి ప్రమొద్ హర్గే మాట్లాడారు. న్యాలం శ్రీనివాస్, దిగంబర్ రావు, మనోహర శాస్త్రి, శశికాంత్ కులకర్ణి, చంద్రశేఖర శర్మ, మచ్చ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.