
జీపీవో రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్: గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈ నెల 25న నిర్వహించే రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. పరీ క్ష నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన తన చాంబర్‌లో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా రాత పరీక్ష జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో 330 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, వీరికి నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామ ని తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 1.30 గంట వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఆల స్యంగా వచ్చే వారిని లోనికి అనుమతించబోరని స్పష్టం చేశారు. కాపీయింగ్‌కు ఆస్కా రం లేకుండా పర్యవేక్షణ జరపాలని, నిబంధనలు పక్కగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్రకుమార్, డీటీవో ఉమా మహేశ్వరరావు, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, తహసీల్దార్ బాలరాజు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్