
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
పెర్కిట్: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మామిడిపల్లి గ్రామంలోని గోవింద్‌పేట్ చౌరస్తాలో తడిసిన ధాన్యంతో రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఆలస్యంగా కొనుగోళ్లు చేపట్టడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వంగా కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రాజాగౌడ్, ఎస్‌హెచ్‌వో గోవింద్‌పేట్ చౌరస్తాకు చేరుకొని కొనుగోళ్లు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ఆర్డీవో పరిశీలించారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి