
తడిసిన ధాన్యానికి తరుగు తీయొద్దు
ఆర్మూర్‌టౌన్ : వర్షానికి తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ కట్టపై గురువారం రైతులు బైఠాయించా రు. మొలకలు వచ్చిన వడ్లను చూపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలను వెనువెంటనే తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. రెండు రోజులుగా వర్షం కురుస్తున్నా త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టడం లేదని, దీంతో విక్రయానికి తీసుకొచ్చిన పంట నీటిపాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజులు గడిచినా కొంతమంది రైతుల ధాన్యం ఇప్పటికీ కాంట కాలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి రాస్తారోకో ప్రాంతానికి చేరుకొని ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడించారు. రెండు రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్
కట్టపై రైతుల బైఠాయింపు
ఆర్డీవో హామీతో ఆందోళన విరమణ
ప్రభుత్వం ఆదుకోవాలి
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఇప్పటికే వడ్లకు మొలకలు వస్తున్నాయి. అకాల వ ర్షంతో ఏం చేయాలో తోచ డం లేదు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. – నరేందర్, రైతు
10 కిలోల వరకు తరుగు తీస్తరట
తడిసిన ధాన్యాన్ని తరుగు లే కుండా కొనుగోలు చేయాలి. 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తామని రైస్‌మిల్లులో చెబుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
– రంజిత్, రైతు

తడిసిన ధాన్యానికి తరుగు తీయొద్దు

తడిసిన ధాన్యానికి తరుగు తీయొద్దు

తడిసిన ధాన్యానికి తరుగు తీయొద్దు