'పదేళ్లకు పైగా ఒకేచోటు' వదలరు.. కదలరు! | Sakshi
Sakshi News home page

'పదేళ్లకు పైగా ఒకేచోటు' వదలరు.. కదలరు!

Published Thu, Dec 14 2023 12:40 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ప్రభుత్వ అధికారులు రెండు మూడు ఏళ్లకు ఒకసారి బదిలీ కావడం సర్వసాధారణం. అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో ఎలాంటి పక్షపా త ధోరణి ప్రదర్శించకుండా ఉండేందుకు గాను బ దిలీలు చేయడం అనేది తప్పనిసరి, ఆనవాయితీ కూడా. అయితే జిల్లాలో కొందరు జిల్లా, మండల స్థాయి అధికారులు తాము ఉన్న సీట్లను వదిలేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

కొందరు కీలక అధి కారులు పదేళ్లకు పైగా ఒకేచోట పని చేస్తుండడంగ మనార్హం. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జిల్లాలోని నందిపేట, డొంకేశ్వర్‌ మండలాల ఎంపీడీవో నాగవర్ధన్‌ 12 ఏళ్లుగా అక్కడ నుంచి కదలకుండా ఉంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడంటూ కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేయడం గమనార్హం.

నాగవర్ధన్‌ అక్రమాలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొందరు జిల్లా అధికారులు స్థాయి లేకున్నప్పటికీ ఇన్‌చార్జి హోదాలో (ఎఫ్‌ఏసీ) ఏళ్లతరబడి కొనసాగుతుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బంది సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమాచారహక్కు చట్టానికి సైతం కొందరు అధికారులు తూట్లు పొడవడం గమనార్హం.

మండలాల్లో..
నందిపేట, డొంకేశ్వర్‌ మండలాల ఎంపీడీవో నాగవర్ధన్‌ 12 సంవత్సరాలుగా అక్కడే తిష్ట వేశారు. బోధన్‌ మున్సిపల్‌ డీఈ శివానందం తొమ్మిదిన్నర ఏళ్లుగా, మేనేజర్‌ నరేందర్‌ ఐదేళ్లుగా కొనసాగు తున్నారు. రుద్రూర్‌ ఎంపీడీవో బాలగంగాధర్‌, కో టగిరి, రుద్రూర్‌ ఎంఈవో శాంతికుమారి ఐదేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, ఏర్గట్ల ఎంఈవో ఆంధ్రయ్య తొమ్మిదేళ్లుగా, బాల్కొండ వ్యవసాయ అధికారి మహేందర్‌రెడ్డి తొమ్మిదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు.

మోర్తాడ్‌ వ్యవసాయ అధికా రి లావణ్య ఎనిమిది ఏళ్లుగా, కమ్మర్‌పల్లి ఐకేపీ ఏపీ ఎం గంగారెడ్డి ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు. మోర్తాడ్‌ ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ముప్కాల్‌ ఎంపీడీవో దామోదర్‌ ఐదేళ్లుగా అదే పోస్టులో ఉన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొందరు అధికారులకు ప్రమోషన్లు వచ్చినప్పటికీ అక్కడే కొనసాగుతుండడం విశేషం.

ఎనిమిదేళ్లుగా..
జిల్లా సహకార అధికారి సింహాచలం ఎనిమిది సంవత్సరాలుగా ఆ పోస్టు నుంచి కదలడం లేదు. సింహాచలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం గమనార్హం. ఇక జెడ్పీ సీఈవో గోవింద్‌నాయక్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిర సైతం ఆరేళ్లుగా కొనసాగుతున్నారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ మాజీ మంత్రి అండతో ఇన్‌చార్జి హోదాలో గత ఐదేళ్లుగా కదలకుండా తిష్ట వేశారు.

రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ వచ్చినప్పటికీ ఛార్జి తీసుకోకుండానే వెళ్లేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే డీఎంహెచ్‌వో సుదర్శన్‌ సైతం ఆరేళ్లుగా ఇన్‌చార్జి హోదాలో కొనసాగుతున్నారు. సుదర్శన్‌ సైతం పలువురు కిందిస్థాయి సిబ్బందిని, కార్లు అద్దెకు పెట్టిన వ్యక్తులను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లా ఉద్యాన అధికారి నర్సింగ్‌దాస్‌, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి దేవేంద్రప్రసాద్‌ ఐదేళ్లుగా ఇక్కడే ఉన్నారు.
ఇవి కూడా చ‌ద‌వండి: 'లంచం అడిగిన ఆర్‌ఐ..' సోషల్‌ మీడియాలో వాయిస్‌ వైరల్‌!

Advertisement
Advertisement