
రద్దు చేయాలని ధర్నా
కుంటాల: సర్దుబాటులో భాగంగా మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు నవీర్, రవీందర్‌ను వేరే పాఠశాలకు పంపించారు. నవీన్‌ను లింబా(కె), రవీందర్‌ను అంబుగామ పాఠశాలలకు పంపించారు. దీనిని రద్దు చేయాలని పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేసి నిర్మల్– బైంసా గురువారం ధర్నా చేశారు. మండలంలోని ఇతర పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులు ఉండగా కల్లూరు పాఠశాల నుంచి నవీన్, రవీందర్‌ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని చూసే తమ పిల్లలును ప్రభుత్వ పాఠశాలకు పంపామన్నారు. వారి డిప్యూటేషన్ రద్దు చేయకుంటే తమ పిల్లలను బడి మాన్పిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కమల్‌సింగ్, ఎస్సై అశోక్ ధర్నా చేస్తున్న పోషకులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. అనంతరం పాఠశాల గేటుకు వేసిన తాళం తీయించి తరగతులు కొనసాగేలా చర్యలు చేపట్టారు.