
పాలుపోసి.. పూజచేసి..
చిట్యాల వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో మహిళల పూజలు..
వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాగదేవతకు పూజలు చేస్తున్న మహిళలు
శ్రావణ పంచమిని నాగుల పంచమిగా జరుపుకోవడం ఆనవాయితీ. మంగళవారం నాగ పంచమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు పుట్టల్లో పాలుపోసి.. నాగమ్మకు పూజలు చేశారు. ఉదయం నుంచే ఆలయాల ఆవరణలోని పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. పాముకు పాలు పోసి.. నాగ దేవతలకు నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, బ్రహ్మంగారి ఆలయం, ట్యాంక్ బండ్ సమీపంలోని పుట్ట, ప్రియదర్శినగర్‌లోని పుట్టల వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు. – నిర్మల్‌టౌన్

పాలుపోసి.. పూజచేసి..