
క్రీడా పాఠశాల పిలుస్తోంది
● నేటి నుంచి ఎంపిక పోటీలు ● మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రక్రియ ● ఎంపికై తే నాలుగో తరగతిలో ప్రవేశం
నిర్మల్ టౌన్: క్రీడా పాఠశాల ఆహ్వానిస్తోంది. చ దువుతోపాటు క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. విద్యార్థులను ఉ త్తమ క్రీడాకారులుగా తయారు చేస్తూ.. కార్పొరే ట్ స్థాయి విద్య అందించేందుకు రాష్ట్రంలో మే డ్చల్ జిల్లాలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలా బాద్‌లో ప్రాంతీయ క్రీడా పాఠశాలలున్నాయి. ఇందులో 2025–2026 విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం కోసం ఎంపిక పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.
మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈనెల 16నుంచి 19వరకు మండలస్థాయి, 23నుంచి 26వరకు జిల్లాస్థాయి, జూలై 1నుంచి 5వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 25 న నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారికి స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం కల్పిస్తారు. అ థ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, రో యింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లి ఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్‌లో శిక్షణ ఇస్తారు.
శారీరక సామర్థ్య పరీక్షలు ఇలా..
విద్యార్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్, 610 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఇలా తొమ్మిది విభాగా ల్లో 27 మార్కులకు గాను ఫిజికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
దరఖాస్తు విధానం ఇలా..
ప్రవేశ ఎంపికకు విద్యార్థులు ఒరిజినల్ ఆధార్ కార్డు, నాలుగో తరగతి చదువుతున్న సర్టిఫికెట్, వయస్సు ఽధ్రువీకరణ పత్రం, మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు దరఖాస్తుకు జత చేయాలి. 8–9 ఏళ్లుండి 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య పుట్టినవారు అర్హులు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు https:tgss. telangana. gov. in లో వివరాలు నమోదు చేసుకోవాలి.
సద్వినియోగం చేసుకోవాలి
స్పోర్ట్స్ స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశానికి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. స్పోర్ట్స్ స్కూళ్లలో సాధించే సర్టిఫికెట్లతో క్రీడా కోట కింద ప్రత్యేక రిజర్వేషన్, ఉన్నత విద్య, ఉద్యోగాలు పొందేందుకు అవకాశముంటుంది. క్రీడలపై ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు 7013396536, 9346655441 నంబర్లలో సంప్రదించాలి. – శ్రీకాంత్‌రెడ్డి,
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి

క్రీడా పాఠశాల పిలుస్తోంది