బిహార్‌లో కూలిన మూడో వంతెన | Under-construction bridge collapses in Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో కూలిన మూడో వంతెన

Jun 24 2024 6:00 AM | Updated on Jun 24 2024 6:00 AM

Under-construction bridge collapses in Bihar

మోతీహారి: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు కూలిపోగా, తాజాగా ఆదివారం తూర్పు చంపారన్‌ జిల్లాలోని మోతీహారిలోని ఘోరాసహన్‌ బ్లాక్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన మరొకటి కూలిపోయింది. 

కాలువపై నిర్మిస్తున్న ఈ వంతెన అమ్వా గ్రామాన్ని బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. 16 మీటర్ల పొడవైన వంతెనను రూరల్‌ వర్క్స్‌ విభాగం రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించామని, అయితే కారణాలేమీ తెలియ రాలేదని ప్రభుత్వ అదనపు కార్యదర్శి దీపక్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement