టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Morning News Headlines (26-12-2020) | Sakshi
Sakshi News home page

టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Dec 26 2020 8:18 AM | Updated on Dec 26 2020 10:16 AM

Today Morning News Headlines (26-12-2020) - Sakshi

21 ఏళ్లకే విజయం‌.. దేశంలో తొలి మేయర్‌
వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్‌. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్. పూర్తి వివరాలు


సొంతింటి కల సాకారం

క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని చెప్పారు. పూర్తి వివరాలు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం

న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం ఉందని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. డిసెంబర్‌ 31న పబ్‌లు, బార్లు, హోటళ్లు, రిసార్ట్‌లు నిర్దేశించిన సమయానికే మూసేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్‌ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. పూర్తి వివరాలు

ధాబా బాబా.. కొత్త రెస్టారెంట్‌

విధి ఎవరిని ఎప్పుడు గెలిపిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి లేటు వయసులో అదృష్టం తలుపుతడుతుంది. అప్పుడు మనం ఎలా స్పందిస్తామనేదానిపై తదుపరి భవిష్యత్‌ ఆధారపడుతుంది. 80 సంవత్సరాల కాంతా ప్రసాద్‌కు చాలా లేటు వయసులో అదృష్టం. పూర్తి వివరాలు

మీ భూములు సురక్షితం

ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్‌ ఫా మింగ్‌) వల్ల రైతుల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటారన్నది అవాస్తవమని, ఆ భయాలు పెట్టుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపోహలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు

వారంలోనే 2,75,310 కేసులు

ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ శరవేగంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లో 1,73,875 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాలు

ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి

జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఓమ్ని వ్యాన్‌ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు

బాక్సింగ్‌ డే టెస్టు : స్టీవ్‌ స్మిత్‌ డకౌట్‌

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత బౌలర్లు మెరిశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలిషాక్‌ ఇచ్చాడు. పూర్తి వివరాలు

అదానీ బ్రాండింగ్‌... నిబంధనలకు విరుద్ధం

నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం లీజుకిచ్చిన మూడు విమానాశ్రయాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తన సొంత బ్రాండ్‌ పేరును ఉపయోగిస్తుండటంపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు


ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో సోనూసూద్‌

ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన స్ఫూర్తితో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ యువకుడు నిర్వహిస్తున్న ‘లక్ష్మీ సోనూ సూద్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌’ను శుక్రవారం సందర్శించారు. పూర్తి వివరాలు


యూనిఫామ్‌ ఆమె తొడుక్కుంటారు

2019 ఏప్రిల్‌లో భారత నావికాదళం వారి ఐ.ఎన్‌.ఎస్‌. విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం జరిగి లెఫ్టినెంట్‌ కమాండర్‌ ధర్మేంద్ర సింగ్‌ చౌహాన్‌ మరణించేనాటికి అతనికి పెళ్లయ్యి నలభై రోజులు. భార్య కరుణ సింగ్‌ అతని వీర మరణాన్ని తొణకక స్వీకరించారు. పూర్తి వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement