కరోనా బీభత్సం: రేపటి నుంచి సినిమాహాళ్లు బంద్‌

Tamil Nadu Says Malls, Theatres And Gyms To Be Shut From April 26 - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం కోవిడ్‌ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, బార్స్, సెలూన్లను మూసేయనుంది. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెస్టారెంట్‌లు, ఇతర కాఫీ షాపుల నుంచి టేక్‌ అవేలకి మాత్రమే అనుమతి ఉంది. పెళ్లిళ్లకి 50 మంది, అంత్యక్రియలకి 25 మంది మాత్రమే హాజరవాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా తమిళనాడుకు రావాలనుకుంటే ఇ–రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ 10 నుంచి ఉదయం 4 వరకు, ఆదివారం లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top