తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం | Tamil Nadu Chief Minister Vijay has taken a key decision | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం

Jun 16 2026 1:23 PM | Updated on Jun 16 2026 2:49 PM

Tamil Nadu Chief Minister Vijay has taken a key decision

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన అన్నదాతల కోసం  అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్నివెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలో రూ.75 వేలకు పైగా రుణం తీసుకున్న సుమారు 14 లక్షలకు పైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగనుంది. ఈ పథకంతో రూ. 5.932 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. ప్రతీ రైతుకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు టీవీకే ప్రకటించిేంది. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఈ పథకం నిబంధనల ప్రకారం సహాకార సంస్థల్లో లోన్‌ తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.75,000ల పరిమితి వరకు 100 శాతం రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ తీసుకున్న రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000ల వరకు రుణమాఫీ వర్తింపజేస్తారు. దీని ద్వారా గత ఏడాది కాలంలో పంట రుణాలు తీసుకున్న వారందరికీ కనీసం రూ.35,000 నుండి గరిష్టంగా రూ.75,000ల వరకు పరోక్ష సహాయం చేకూరనుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement