అది మహాభారత వైవాహిక యుద్ధం | Supreme Court Mahabharata Rs 5 crore alimony | Sakshi
Sakshi News home page

అది మహాభారత వైవాహిక యుద్ధం

Apr 9 2026 4:24 AM | Updated on Apr 9 2026 4:24 AM

Supreme Court Mahabharata Rs 5 crore alimony

వివాహాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు  

భార్యకు రూ.5 కోట్లు చెల్లించాలని భర్తకు ఆదేశం  

న్యూఢిల్లీ: విడిపోయిన దంపతుల మధ్య దశాబ్ద కాలంగా సాగుతున్న వివాదాన్ని సుప్రీంకోర్టు ‘మహాభారత వైవాహిక యుద్ధంగా అభివరి్ణంది. ఈ న్యాయ పోరాటానికి పూర్తిగా ముగింపు పలికింది. వివాహాన్ని రద్దు చేసింది. ఆ వివాహం అచరణాత్మకంగా అన్ని విధాలుగా ముగిసిపోయినట్లు పేర్కొంది. వివాహాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 142 కింద తమకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంది. సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి ఏ కేసులోనైనా ఎలాంటి ఉత్తర్వునైనా జారీ చేసే అధికారాన్ని ఈ ఆర్టీకల్‌ సుప్రీంకోర్టుకు కల్పిస్తుంది. 

ఈ కేసులో వృత్తిరీత్యా న్యాయవాది అయిన భర్త తన న్యాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి భార్య, ఆమె కుటుంబం, చివరికి ఆమె తరఫు న్యాయవాదిపై పగతో కూడిన ప్రచారం ప్రారంభించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. విడిపోయి విరోధులుగా మారిన దంపతులు దీర్ఘకాలిక, తీవ్రమైన వైవాహిక కలహంలో చిక్కుకున్నారని, ఫలితంగా వివిధ కోర్టులు, వేదికలలో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయని తెలిపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. భార్య, పిల్లలు నిరాశ్రయులు కాకుండా ప్రతివాది అయిన భర్త మొత్తం రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement