‘నిందితుల‍్లో భయం పుట్టాలి’.. ఆర్‌జీ కార్‌ దారుణంపై మోదీ కామెంట్స్‌ | Strictest Punishment For Crimes Against Women : PM modi | Sakshi
Sakshi News home page

‘నిందితుల‍్లో భయం పుట్టాలి’.. ఆర్‌జీ కార్‌ దారుణంపై మోదీ కామెంట్స్‌

Aug 15 2024 10:31 AM | Updated on Aug 15 2024 1:19 PM

Strictest Punishment For Crimes Against Women : PM modi

న్యూఢిల్లీ:  కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఆస్పత్రి మెడికల్‌ కాలేజీలో జరిగి దారుణంపై ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై తాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ..‘వైమానిక దళం, సైన్యం, నౌకాదళం, అంతరిక్షం ఇలా అనేక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. కానీ వారిపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రోజు ఎర్రకోట నుండి నా బాధను వ్యక్తం చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. 

‘మా తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను  సైతం అదే విధమైన ఆగ్రహంతో ఉన్నా. మన రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. మహిళలపై జరిగిన నేరాల పట్ల వీలైనంత త్వరగా విచారణ జరగాలి. నిందితుల్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’అని మోదీ అన్నారు.  

అనంతరం మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నారు. కానీ నిందితులకు శిక్షలు పడినప్పుడు వాటికి ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నారు. నేరస్థుల్ని బయపెట్టారు. వారు భయపడేలా శిక్షల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు.  

Advertisement
 
Advertisement
Advertisement