జూన్‌లో 10.8 కోట్ల కోవిషీల్డ్‌ టీకాలు ఉత్పత్తి చేసిన సీరమ్‌ 

SII So Far Produced Above 10 Crore Covishield Doses And Handed To Government - Sakshi

న్యూఢిల్లీ: ముందుగా హామీ ఇచ్చిన మేరకు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) జూన్‌ నెలలో ఇప్పటిదాకా 10.8 కోట్ల కోవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి అందజేసింది. జూన్‌ 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత టీకాలను అందజేస్తున్న విషయం తెలిసిందే.

21న రికార్డు స్థాయిలో 86 లక్షల పైచిలుకు డోసులను వేసినప్పటి నుంచీ దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆరు రోజులుగా సగటున 69 లక్షల టీకాలు ఇస్తున్నారు. సీరమ్‌ జూన్‌లో ఇప్పటిదాకా 45 బ్యాచుల్లో 10.8 కోట్ల టీకా డోసులను కసౌలీ (హిమాచల్‌ప్రదేశ్‌)లోని సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబోరేటరీకి పంపింది. అక్కడ ప్రతిబ్యాచ్‌ను పరీక్షించిన తర్వాత... టీకాలను దేశవ్యాప్తంగా  సరఫరా చేస్తారు.

చదవండి:
5 నిమిషాల వ్యవధిలో మహిళకు కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌..
వైరల్‌: టూర్‌ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top