ప్లీజ్‌.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి

Shirdi Saibaba Temple Appeals Come In Civilised Clothes - Sakshi

ముంబై: బాబా దర్శనానికి వచ్చే వారు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు నిర్వహకులు భక్తులను అభ్యర్థించారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే అని.. భక్తులపై ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ విధించలేదని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. ‘బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో కొందరి వస్త్రధారణ పట్ల పలవురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర దుస్తులు ధరించి ఆలయంలోకి వచ్చారని కొం‍దరు ఫిర్యాదు చేశారు. అందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. కనుక మోడర్న్‌ దుసుల్లో వచ్చే వారికి మా విజ్ఞప్తి ఇదే.. దయచేసి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రండి. ఇది కేవలం విన్నపం మాత్రమే. భక్తుల మీద ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ విధంచలేదు’ అని తెలిపారు. (చదవండి: సమసిన షిర్డీ వివాదం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top