Rahul Gandhi Defamation Case: అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్‌

Shashi Tharoor Sadi Rahul Gandhi Case Unprecedented Opposition Unity - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి రెండేళ్లు జైలు శిక్షపడి, అనర్హత వేటు పడగానే ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ అ‍న్నారు. ఈ మేరకు శశి థరూర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఒకరంగా ఇది అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ప్రత్యర్థిగా భావించే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండటమే చూశాం మనం. కానీ నేడు కాంగ్రెస్‌ పక్షాన నిలబడ్డాయి ఆయా పార్టీలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బెంగాల్‌లోని మమతా బెనర్జీ, హైదరాబాద్‌లో చంద్రశేఖర్‌ తోసహా అందరూ రాహుల్‌కి మద్దతుగా నిలిచారు.

గతంలో కాంగ్రెస్‌తో ఈ పార్టీలన్నీ ఏవిధంగానూ సంబంధం కలిగి లేవు. బీజేపీ చర్య అనాలోచిత పరిణామాల చట్టల పరిధిలో తొలిస్థానంలో ఉంది. ఆయా పార్టీ ముఖ్యమంత్రులందరూ రాహుల్‌ పేరు ప్రస్తావించకుండానే ఈ చర్యను ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ముక్త కంఠంతో వ్యాఖ్యానించారు. అంతేగాదు కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయి. కానీ రాహుల్‌ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం అనేది సరి కాదని అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. అదీగాక పారపోయిన వ్యాపారవేత్తలు లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ, ఇద్దరూ వెనకబడినవారు కానందున రాహుల్‌పై వచ్చిన అభియోగాలు అర్థరహితమైనవి.

వారంతా తమ అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి విలాసవంతంగా జీవిస్తున్నారు. వారిని వెనుకబడిన తరగతుల వారుగా చెబుతూ..ఓబీసీలపై దాడి అని వ్యాఖ్యనించి చెబుతున్న వారి ఇంగితజ్ఞానం విస్మయానికి గురి చేస్తోంది. అని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు థరూర్‌ కూడా రాహుల్‌పై కోర్టు విధించిన శిక్ష పట్ల అభ్యంతరం చెబుతూ..ఈ కేసు బలహీనంగా ఉంది. మాకు మంచి న్యాయవాదులు ఉన్నారు. ఫిర్యాదుదారుడికి బలహీనమైన కేసు ఇది అని అన్నారు.

అలాగే కేసు పెట్టిన నాల్గవ మోదీ..పూర్ణేశ్‌ మోదీ తనను ఏ రకంగా టార్గెట్‌ చేశారని నిరూపించగలడు అని శశి థరూర్‌ అన్నారు. కాగా రాహుల్‌ గాంధీ తరుఫు న్యాయవాది కోర్టు కార్యకలాపాలు ఆది నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. రాహుల్‌ తన ప్రసంగంలో మోదీని లక్ష్యంగా చేసుకున్నందున ఫిర్యాదుదారునిగా ప్రధాని మోదీ ఉండాలి కానీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ కాదని ఆయన వాదించారు. 

(చదవండి: ట్వీట్‌ దుమారంపై స్పందించిన ఖుష్బు! మరిన్ని తీయండి అంటూ కౌంటర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top